Posts

Showing posts from October, 2023

డౌనూరులో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన - News Coverage

Image
  అల్లూరి జిల్లా ఏజెన్సీ లో సేంద్రీయ విధానంలో గిరిజనులు  సాగు చేస్తున్న అరకు వ్యాలీ కాఫీకి ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు ,  డిమాండ్ వున్నాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వేడిక రాజన్నదొర చెప్పారు. శుక్రవారం కొయ్యూరు  మండలంలోని డౌనూరులో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో రూ. 4  కోట్లతో నిర్మించనున్న సమీకృత కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు. అనంతరం జీసీసీ ఎండీ సురేశ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ ,  కాఫీ రైతుల ను మరింత ప్రోత్సహిం చేందుకు ,  ఆధునిక పద్ధతుల్లో - నాణ్యమైన కాఫీని ఉత్పత్తి చేసేందుకు ఈ ప్రాసెసింగ్ యూనిట్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఆరు నెలల్లో ఇది అందుబాటులోకి తీసుకురావాలని అధికారు లను ఆదేశించారు. గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని ,  ఇందు లో భాగంగానే కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. రైతులు తాము పండించిన కాఫీ పంటను దళారులకు కాకుండా జిసిసికి విక్రయిం చాలని ,  ...

గిరిజనులకు కొండంత అండగా జిసిసి - 'సాక్షి' ప్రత్యేక కథనం

Image
కొండకోనల్లో సేంద్రియ పద్ధతుల్లో గిరిజనులు పండించే ఆరోగ్యకర పంటలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయి. ఆరోగ్యాన్ని, ఆయుష్షును పెంచుతున్నాయి. ప్రభుత్వ తోడ్పాటుతో నాణ్యమైన గిరిజన ఉత్పత్తులను వినియోగదారులకు సరసమైన ధరకే అందించే బృహత్తర క్రతువును జీసీసీ భుజానికెత్తుకుంది. ట్రైఫెడ్ సహకారంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఓ వైపు గిరిజన రైతులకు, మరోవైపు వినియోగదారులకు లబ్దిచేకూర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. గిరిజన ఉత్పత్తుల ప్రాసెసింగ్, విక్రయాలు, ప్రజలకు కలుగు తున్న ప్రయోజనాలకు 'సాక్షి' అక్షరరూపం.

TRIFED ద్వారా మార్కెటింగ్ సౌకర్యం - జీసీసీ ఎండీ సురేష్ కుమార్

Image
గిరిజన ఉత్పత్తులకు ట్రైఫెడ్ ద్వారా మార్కెటింగ్ సౌకర్యం కల్పించబడుతుందని జీసీసీ ఎండీ సురేష్ కుమార్ అన్నారు. సోమవారం సీతంపేట ఐటిడిఎలో నిర్వహించిన గిరిజన కళాకృతుల ప్రదర్శన మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ సీతంపేటలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం శుభపరిణామం అని అన్నారు. సీతంపేటలో వీడీవీకేలు చాలా బాగా పనిచేస్తున్నాయని అన్నారు. గిరిజన ఉత్పత్తులు కూడా చాలా బాగున్నాయని అన్నారు. సీతంపేట ప్రాంతంలో తయారయ్యే గిరిజన ఉత్పత్తులకు రాష్ట్రంలో మంచి డిమాండ్ ఉందని అన్నారు. వీడీవీకేలకు జీసీసీ తరుపున పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. ఐటిడిఎ పీవో కల్పనకుమారి మాట్లాడుతూ వీడీవీకే సభ్యులు భవిష్యత్తులో వ్యాపారవేత్తలుగా తయారవ్వాలని అన్నారు. మార్కెటింగ్ పై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. తయారుచేసే గిరిజన ఉత్పత్తులు నాణ్యతతో ఉండాలని అన్నారు. ఐటిడిఎ నుంచి పూర్తి సహకారం అందేలా చర్యలు తీసుకొంటామని అన్నారు .

Harvest of Coffee Appears Promising in Manyam District

Image
Harvest of Coffee Appears Promising in Manyam District Deccan Chronicle.|  Aruna Published on: October 9, 2023 | Updated on: October 9, 2023 Farmers are witnessing a promising harvest within coffee plantations in Manyam district. In Paderu, wherever the eyes go, coffee can be seen in the form of green buds and light red fruits.( Image: Twitter) Visakhapatnam:  Farmers are witnessing a promising harvest within coffee plantations in Manyam district. In Paderu, wherever the eyes go, coffee can be seen in the form green buds and light red fruits. Manyam’s farmers say this year's crop is going to be good due to abundant rains in the months of March to May. This is the period when coffee plants are flowering, pollinating and fertilising. According to an estimate, this year's yield of coffee beans is expected to be 750 kg per acre. Farmer Kimudu Krishnam Naidu of Gudem village in Peddabailu mandal says, "The agency has been blessed with more than normal rains between M...