వెయ్యి టన్నుల కాఫీ గింజల కొనుగోలు లక్ష్యం : జిసిసి ఎం.డి. జి. సురేష్ కుమార్
అల్లూరి జిల్లాలో గిరిజన సహకార సంస్థ(జీసీసీ) వెయ్యి టన్నుల కాఫీ గింజలు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జి.సురేశ్‌కుమార్ IIS తెలిపారు. ఇటీవల జీకేవీధి మండలంలోని శివారు పెదవలస, ఎర్రచెరువులు, మాడెం గ్రామాలతో పాటు చింతపల్లి మండలంలోని చిక్కుడుబట్టి, కిటుముల, బౌడ గ్రామాలను సందర్శించారు. ఆదివాసీ కాఫీ రైతులతో స్వయంగా మాట్లాడి కాఫీ గింజల కొనుగోలు, ధరలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆదివాసీ రైతులకు అపెక్స్ కమిటీ సిఫారసు చేసిన అంతర్జాతీయ ధరలను జీసీసీ అందిస్తున్నదన్నారు. కిలో పార్చిమెంట్ రూ.280, చెర్రీ రూ.145, రొబస్ట్రా రూ.70 ధరలకు కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ప్రైవేటు వర్తకులు జీసీసీ కంటే రూ.30-40 తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఆదివాసీ రైతులు పండించిన కాఫీ గింజలను జీసీసీకి విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పాడేరు, చింతపల్లి డివిజన్ల పరిధిలో ఇప్పటికే 200 టన్నుల పార్చిమెంట్ కొనుగోలు చేశామన్నారు. ప్రస్తుతం చెర్రీ సీజన్ ప్రారంభమైందన్నారు. గత ఏడాది జిల్లాలో వెయ్యి టన్నుల కాఫీ గింజలు కొనుగోలు చేశామన్నారు. ...