గిరిజనులకు కొండంత అండగా జిసిసి - 'సాక్షి' ప్రత్యేక కథనం
కొండకోనల్లో సేంద్రియ పద్ధతుల్లో గిరిజనులు పండించే ఆరోగ్యకర పంటలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయి. ఆరోగ్యాన్ని, ఆయుష్షును పెంచుతున్నాయి. ప్రభుత్వ తోడ్పాటుతో నాణ్యమైన గిరిజన ఉత్పత్తులను వినియోగదారులకు సరసమైన ధరకే అందించే బృహత్తర క్రతువును జీసీసీ భుజానికెత్తుకుంది. ట్రైఫెడ్ సహకారంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఓ వైపు గిరిజన రైతులకు, మరోవైపు వినియోగదారులకు లబ్దిచేకూర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. గిరిజన ఉత్పత్తుల ప్రాసెసింగ్, విక్రయాలు, ప్రజలకు కలుగు తున్న ప్రయోజనాలకు 'సాక్షి' అక్షరరూపం.
Comments
Post a Comment