Posts

Showing posts from October 21, 2023

డౌనూరులో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన - News Coverage

Image
  అల్లూరి జిల్లా ఏజెన్సీ లో సేంద్రీయ విధానంలో గిరిజనులు  సాగు చేస్తున్న అరకు వ్యాలీ కాఫీకి ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు ,  డిమాండ్ వున్నాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వేడిక రాజన్నదొర చెప్పారు. శుక్రవారం కొయ్యూరు  మండలంలోని డౌనూరులో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో రూ. 4  కోట్లతో నిర్మించనున్న సమీకృత కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు. అనంతరం జీసీసీ ఎండీ సురేశ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ ,  కాఫీ రైతుల ను మరింత ప్రోత్సహిం చేందుకు ,  ఆధునిక పద్ధతుల్లో - నాణ్యమైన కాఫీని ఉత్పత్తి చేసేందుకు ఈ ప్రాసెసింగ్ యూనిట్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఆరు నెలల్లో ఇది అందుబాటులోకి తీసుకురావాలని అధికారు లను ఆదేశించారు. గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని ,  ఇందు లో భాగంగానే కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. రైతులు తాము పండించిన కాఫీ పంటను దళారులకు కాకుండా జిసిసికి విక్రయిం చాలని ,  ...