TRIFED ద్వారా మార్కెటింగ్ సౌకర్యం - జీసీసీ ఎండీ సురేష్ కుమార్
గిరిజన ఉత్పత్తులకు ట్రైఫెడ్ ద్వారా మార్కెటింగ్
సౌకర్యం కల్పించబడుతుందని జీసీసీ ఎండీ సురేష్ కుమార్ అన్నారు. సోమవారం సీతంపేట
ఐటిడిఎలో నిర్వహించిన గిరిజన కళాకృతుల ప్రదర్శన మేళా కార్యక్రమంలో ఆయన
పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ సీతంపేటలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం
శుభపరిణామం అని అన్నారు. సీతంపేటలో వీడీవీకేలు చాలా బాగా పనిచేస్తున్నాయని
అన్నారు. గిరిజన ఉత్పత్తులు కూడా చాలా బాగున్నాయని అన్నారు. సీతంపేట ప్రాంతంలో తయారయ్యే గిరిజన ఉత్పత్తులకు రాష్ట్రంలో మంచి డిమాండ్ ఉందని అన్నారు. వీడీవీకేలకు జీసీసీ తరుపున పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. ఐటిడిఎ పీవో కల్పనకుమారి మాట్లాడుతూ వీడీవీకే సభ్యులు భవిష్యత్తులో వ్యాపారవేత్తలుగా తయారవ్వాలని అన్నారు. మార్కెటింగ్ పై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. తయారుచేసే గిరిజన ఉత్పత్తులు నాణ్యతతో ఉండాలని అన్నారు. ఐటిడిఎ నుంచి పూర్తి సహకారం అందేలా చర్యలు తీసుకొంటామని అన్నారు.
Comments
Post a Comment