• మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం : జీసీసీ వైస్ చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్ జి.సురేష్ కుమార్
•వన్ ధన్ వికాస్ కేంద్రాల ద్వారా జీడిపిక్కల ప్రోసెసింగ్ యూనిట్లు జీసీసీ వైస్ చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్ జి.సురేష్ కుమార్ అల్లూరి జిల్లా కొయ్యూరు, రాజవొమ్మంగి మండలాల్లో శరభన్నపాలెం, డౌనూరు, అంతాడ, మంప, గంగవరం, శరభవరం, తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్య టించారు. ఆయా ప్రాంతాల్లోని వన్ ధన్ వికాస్ కేంద్రాలను (VDVK) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వీడీవీకే సభ్యులతో మాట్లాడుతూ కొయ్యూరు మండలంలోని జీడి తోటల విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరు చోట్ల జీడీపిక్కల ప్రొసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు యోచిస్తున్నామ న్నారు. ఆయా యూనిట్ల ద్వారా మహిళలు ఉపాధి పొందేందుకు సుమారు ఆరు నుంచి ఏడు లక్షల రూపాయల వ్యయంతో ప్రాసెసింగ్ యంత్రాలు అందజేసి, మహిళలకు శిక్షణ ఇస్తామన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని కోరారు. రైతులకు మేలు చేసేందుకు వీలుగా జీడిపండ్ల ప్రాసెసింగ్ యూనిట్స్ను కొయ్యూరులో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. మంప గ్రామంలోని అల్లూరి సీతారామరాజు పార్కును సందర్శించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 300 టన్నులు కాఫీ గింజలను కొనుగోలు చేసినట్టు తెలిపారు. జీసీసీ ద్వారా ఈ ఏడాది వేసవిలో నన్నారితో పా...