Posts

Showing posts from May 22, 2023

• జిసిసి వయా బిగ్ బాస్కెట్ • అటవీ ఉత్పత్తుల అమ్మకానికి కార్పోరేట్ తో జోడీ • హాస్టళ్లకు చింతపండు, కారం, పసుపు సరఫరాకు ప్రణాళిక : జి. సురేష్ కుమార్, జిసిసి మేనేజింగ్ డైరెక్టర్ & వైస్ చైర్మెన్

Image
  • జిసిసి వయా బిగ్ బాస్కెట్ • అటవీ ఉత్పత్తుల అమ్మకానికి కార్పోరేట్ తో జోడీ • హాస్టళ్లకు చింతపండు , కారం , పసుపు సరఫరాకు ప్రణాళిక :  జి. సురేష్ కుమార్, జిసిసి మేనేజింగ్ డైరెక్టర్ & వైస్ చైర్మెన్   ప్రజాశక్తి దినపత్రిక కథనం   గిరిజనుల నుంచి గిరిజన సహకార సంస్థ (జిసిసి) సేకరిస్తోన్న అటవీ ఉత్పత్తులు , పంటలు అమ్మకానికి కార్పొరేట్ సంస్థ అయిన బిగ్ బాస్కెట్ జోడీ కట్టనుంది. ఇందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించింది. ప్రభుత్వ వసతి గృహాలకు చింతపండు , కారం , పసుపు సొంతంగా సరఫరా చేసేందుకు సిద్ధమవుతోంది. వ్యాపారాభివృద్ధికి కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. తద్వారా తన ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది. ఏజెన్సీ ప్రాంతం అటవీ ఉత్పత్తులు , ఆర్గానిక్ పంటలకు బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో , వీటి సేకరణ పెంచే దిశగా జిసిసి అడుగులు వేస్తోంది. ఈ సంస్థకు మార్కెటింగ్ నెట్ వర్క్ పరిమితంగా ఉంది. దీంతో , ' బిగ్ బాస్కెట్ ' సంస్థ ద్వారా ఉత్పత్తులను వినియోగదారుల దగ్గరకు తీసుకెళ్లాలని యోచిస్తోంది. దీనివల్ల అమ్మకాలు పెరుగుతాయని , లాభాలు వస్తాయని భావిస్తోంది. ఇది విజయవంతం అయితే అట