అరకువ్యాలీ కాఫీ, జిసిసి కృషిని ప్రశంసించిన ప్రధాని మోది జి.. అరకు కాఫీ రుచిని ఆస్వాదించమని మన్ కి బాత్ శ్రోతలను కోరిన ప్రధాని
అరకు వ్యాలీ కాఫీ స్థాయిని ప్రపంచస్థాయిలో విస్తృతం చేయడంలో గిరిజన సహాకార సంస్థ (జిసిసి) కీలక పాత్ర పోషిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోది ప్రసంశించారు. ఆదివారం నాడు మన్ కి భాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అల్లూరి జిల్లా మన్యం ప్రాంతంలో గిరిజన సహకార సంస్థ, ఎపి ప్రభుత్వ సహకారంతో గిరిజనులు సాగు చేస్తున్న అరకువ్యాలీ కాఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మన దేశంలో స్థానిక ఉత్పత్తులు ప్రపంచ స్థాయి గుర్తింపును సాదిస్తుండడం భారతీయులంతా గర్వించదగ్గ విషయమని ప్రధాని నరేంద్ర మోది అన్నారు. అలాంటి ఉత్పత్తుల్లో అరకువ్యాలీ కాఫీ ప్రధమ శ్రేణిలో వుంటుంది అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీని గిరిజనులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారని, శ్రేష్టమైన అరోమా రుచి గల ఇక్కడ పండే అరకు కాఫీ మంచి గుర్తింపు వుందని ప్రధాని అన్నారు. 1 లక్షా 50 వేల మంది ఆదివాసీ కుటుంబాలు అరకు కాఫీ సాగు, ఉత్పత్తి, విక్రయాలతో ఆర్ధిక సాధికారత సాధిస్తున్నారని అన్నారు. కాఫీకి గ్లోబల్ గుర్తింపు తీసుకురావడంలో విశేషమైన కృషి చేస్తున్న గిరిజన సహకార సంస్థ (జిసిసి) ఆదివాసీ రైతు సోదర,సోదరీమనులను ఒక త్రాటిపైకి తీసుకువచ్చి, కాఫీ సాగుకు ప్రోత్సహిస్తున్నదని ప్రశంసించారు. ఈ ప్రక్రియలో గిరిజనుల ఆదాయం గణనీయంగా పెరగడంతో పాటు గౌరవనీయమైన జీవనాన్ని సాగిస్తున్నారని అన్నారు
Comments
Post a Comment