• మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం : జీసీసీ వైస్ చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్ జి.సురేష్ కుమార్

 



•వన్ ధన్ వికాస్ కేంద్రాల ద్వారా జీడిపిక్కల ప్రోసెసింగ్ యూనిట్లు
జీసీసీ వైస్ చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్ జి.సురేష్ కుమార్ అల్లూరి జిల్లా కొయ్యూరు, రాజవొమ్మంగి మండలాల్లో శరభన్నపాలెం, డౌనూరు, అంతాడ, మంప, గంగవరం, శరభవరం, తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్య టించారు. ఆయా ప్రాంతాల్లోని వన్ ధన్ వికాస్ కేంద్రాలను (VDVK) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వీడీవీకే సభ్యులతో మాట్లాడుతూ కొయ్యూరు మండలంలోని జీడి తోటల విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరు చోట్ల జీడీపిక్కల ప్రొసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు యోచిస్తున్నామ న్నారు. ఆయా యూనిట్ల ద్వారా మహిళలు ఉపాధి పొందేందుకు సుమారు ఆరు నుంచి ఏడు లక్షల రూపాయల వ్యయంతో ప్రాసెసింగ్ యంత్రాలు అందజేసి, మహిళలకు శిక్షణ ఇస్తామన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని కోరారు. రైతులకు మేలు చేసేందుకు వీలుగా జీడిపండ్ల ప్రాసెసింగ్ యూనిట్స్ను కొయ్యూరులో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. మంప గ్రామంలోని అల్లూరి సీతారామరాజు పార్కును సందర్శించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 300 టన్నులు కాఫీ గింజలను కొనుగోలు చేసినట్టు తెలిపారు. జీసీసీ ద్వారా ఈ ఏడాది వేసవిలో నన్నారితో పాటు కొన్ని రకాల డ్రింక్లను ఉత్పత్తులు చేస్తామన్నారు. కొయ్యూరు జీసీసీ బీఎం భవనాన్ని రూ.9.7 లక్షలతో మరమ్మతులు చేపతామన్నారు. జీసీసీ గోడౌను కొయ్యూరు తర లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆదివాసీలు కష్టపడి పండిం చిన పంటను ధనంగా మలచుకోడానికే వీడీవీకేలు (వన్డేన్ వికాస కేంద్రాలు) ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పాడేరు డివిజన్లో-9, రంపచో డవరం డివిజన్-110 ఏర్పాటు చేశామన్నారు. . వీడీ వీకేల్లో చింతపండు, పసుపు, కొండ చీపుళ్లు, అడ్డా కుల తయారీ యూనిట్లు కూడా ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సభ్యులకు సూచించారు. ఈ సంధర్భంగా స్థానిక జీసీసీ అధికారులు, సిబ్బంది ఎండీ సురేష్కుమా రకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. సీనియర్ మేనేజర్ శేఖర్, డీఎం దేవరాజ్, బీఎం విజయకుమార్, జీసీసీ మేనేజర్ విజయలక్ష్మి, సిబ్బంది పాల్గొ న్నారు. సేల్స్ ఉమన్లు సత్యవతి, లక్ష్మి, వెలుగు వీఓఏ రామరాజు తదితరులున్నారు.





Comments

Popular posts from this blog

అరకువ్యాలీ కాఫీ, జిసిసి కృషిని ప్రశంసించిన ప్రధాని మోది జి.. అరకు కాఫీ రుచిని ఆస్వాదించమని మన్ కి బాత్ శ్రోతలను కోరిన ప్రధాని

🌿 Embrace the goodness of Turmeric from the heartlands of Andhra Pradesh! 🌿

వెయ్యి టన్నుల కాఫీ గింజల కొనుగోలు లక్ష్యం : జిసిసి ఎం.డి. జి. సురేష్ కుమార్