TCR & TM ప్రాంగణంలో అల్లూరి సీతారామరాజు 126 జయంతి ఉత్సవాలు..పాల్గొన్న డిప్యూటి సిఎం రాజన్న దొర

 

విశాఖపట్నం రుషికొండ దగ్గర గిరిజన సంస్కృతి పరిశోధన మరియు శిక్షణ సంస్థ ( TCR & TM ) ప్రాంగణంలో  అల్లూరి.సీతారామరాజు 126 జయంతి ఉత్సవాలను కేంద్ర గిరిజన వ్యవహారాలు మంత్రిత్వ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ సౌజన్యంతో  ఘనంగా నిర్వహించారు.  విశాఖపట్నంలో రుషి కొండ దగ్గ ఉన్న గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణ సంస్థ ప్రాంగణంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సి.యం & గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పీడిక.రాజన్నదొర. ఈ సందర్భంగా ఆ కార్యాలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన మన్యం వీరుడు అల్లూరి.సీతారామ రాజు,గిరిజన స్వాతంత్ర్య సమరయోధులు గాం గంటం దొర,గాం మల్లుదొర గార్ల విగ్రహాలను ఆవిష్కరించి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ సభ్యురాలు గోట్టేటి.మాధవి ,ఉమ్మడి విశాఖ పట్నం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి.సుభద్ర , విశాఖ GVMC మేయర్ గొలాగాని.వెంకట హరి కుమారి ,జిసిసి చైర్ పర్సన్.శోభా.స్వాతి రాణి ,పాడేరు ఐటీడీఏ పి.వొ అభిషేక్, జి.సి.సి వైస్ చైర్మన్ & ఎం.డి జి. సురేష్  కుమార్, ట్రైకార్ ఎం.డి రవీంద్ర బాబు, TCR & TM ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చినబాబు తదితరులు పాల్గొన్నారు.






Comments

Popular posts from this blog

అరకువ్యాలీ కాఫీ, జిసిసి కృషిని ప్రశంసించిన ప్రధాని మోది జి.. అరకు కాఫీ రుచిని ఆస్వాదించమని మన్ కి బాత్ శ్రోతలను కోరిన ప్రధాని

🌿 Embrace the goodness of Turmeric from the heartlands of Andhra Pradesh! 🌿

వెయ్యి టన్నుల కాఫీ గింజల కొనుగోలు లక్ష్యం : జిసిసి ఎం.డి. జి. సురేష్ కుమార్