డౌనూరులో కాఫీ ప్రాసెసింగ్ సెంటర్ రూ.4 కోట్లతో నిర్మాణం » గడచిన ఆర్థిక సంవత్సరంలో వెయ్యి టన్నులుకొనుగోలు చేసిన జీసీసీ » రూ.20 కోట్ల టర్నోవర్

 

డౌనూరులో కాఫీ ప్రాసెసింగ్ సెంటర్

రూ.4 కోట్లతో నిర్మాణం » గడచిన ఆర్థిక సంవత్సరంలో వెయ్యి టన్నులుకొనుగోలు చేసిన జీసీసీ

రూ.20 కోట్ల టర్నోవర్

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కాఫీపై గిరిజన సహకార సంస్థ (జీసీసీ) దృష్టిసారించింది. విశా ఖ ఏజెన్సీలో విస్తృతంగా సాగులో వున్న కాఫీని జీసీసీ.. రైతుల నుం చి సేకరించి, శుద్ధి చేసి జాతీయ మార్కెట్లో విక్రయిస్తోంది. మా ర్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వేయి టన్నుల కాపీని కొనుగో లు చేసింది. వేయి టన్నుల్లో 480.28 టన్నులు పార్చుమెంట్ కాఫీ కాగా, ఇంకో 515.81 టన్నుల చెర్రీ, పార్చుమెంట్కు కిలోకు రూ.285 చొప్పున, చెర్రీకి రూ.145 చెల్లించింది. మొత్తంగా చూసుకుంటే కాఫీ లావాదేవీల ద్వారా రూ.20 కోట్ల టర్నోవర్ సాధించింది. ఒక్క కాఫీ ద్వారా రూ.1.5 కోట్ల వరకు లాభం రావడంతో అందులో 50 లక్షల మొత్తాన్ని సామాజిక సేవ కింద తిరిగి గిరిజనులకు ఇవ్వాలని నిర్ణ యించింది. ఈ నిధులతో గిరిజనులు కాఫీ ఆరబెట్టుకోవడానికి ఉప యోగపడే టార్పాలిన్లు ఇవ్వాలని నిర్ణయించింది.

బెంగళూరులో ప్రాసెసింగ్

సేకరించిన కాఫీని ఎంత చక్కగా ప్రాసెసింగ్ చేస్తే అంత మం చి ధర లభిస్తుంది. అందుకని జీసీసీ ఇక్కడ సేకరించిన కాఫీని బెంగళూరుకు పంపించి అక్కడ ప్రాసెసింగ్ చేయించేది. దీనికి కొం త వ్యయం అయ్యేది. అయితే ఇక్కడే ప్రాసెసింగ్ సెంటర్ కూడా పెడితే స్థానికులకు ఉపాధి కూడా కలుగుతుందని భావించడంతో ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు ప్రాసెసింగ్, రోస్టింగ్, గ్రైం డింగ్ అన్నీ ఇక్కడే చేసుకునేలా యూనిట్ మంజూరుచేశారు. దీని నీ ఎక్కడ పెట్టాలా? అని ఆలోచించి, కాఫీ రైతులకు అందుబాటు లో ఉండేలా డౌనూరును ఎంపిక చేశారు. అక్కడ జీసీసీకి ఐదు ఎ కరాల వరకు స్థలం ఉంది. అందులో నాలుగు కోట్ల రూపాయలతో ప్రాసెసింగ్ సెంటర్ పెట్టాలని నిర్ణయించారు. అన్నీ అనుకున్నట్టు నెలల్లో పనులు ప్రారంభమయ్యే అవకాశంఉంది.

జీసీసీ ద్వారానే ఆర్గానిక్ సర్టిఫికేషన్

ఏజెన్సీలో రైతులు ఎటువంటి ఎరువులు ఉపయోగించకుండా కాఫీని పండిస్తున్నారు. జీసీసీ వాటిని పర్యవేక్షిస్తూ ఆర్గానిక్ సర్టిఫికే షన్ ఇస్తోంది. చింతపల్లి మండలంలో 865 హెక్టార్లలో 1300 మం ది రైతులకు, జీకే వీధి మండలంలో 1,374 హెక్టార్లలో మరో 1,300 మంది రైతులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇస్తోంది. ఇదికాకుండా మరో 2,600 ఎకరాల్లో గిరిజనులు పండిస్తున్న కాపీకి కూడా ఈసారి ఆ ర్గానిక్ సర్టిఫికేషన్ ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.

ఇంటిగ్రేటెడ్ యూనిట్ పెడతాం

సేకరించిన కాఫీని క్కడే ప్రాసెసింగ్ చేసి, బీన్ని రోస్టింగ్ చేసి, వా టిని గ్రైండింగ్ చేసి పౌ తయారుచేసేలా ఇంటిగ్రేటెడ్ యూనిట్ పెట్టాలని భావిస్తున్నా ము. సుమారు నాలుగు కోట్ల వ్యయం అవుతుం ది. దీనికి టెండర్ కూడా సిద్ధం చేశాం. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత ఏ నులు ప్రారంభిస్తాం. - జి.సురేష్ కుమార్, ఎండీ, జీసీసీ

Comments

Popular posts from this blog

Andhra GCC Products Aim for Global Recognition : Dy.CM P.Rajanna Dora